వచ్చే సంవత్సరం హరిత హారంలో నాటే మొక్కల వివరాలు తెలుపాలి

Date:08/09/2020

కామారెడ్డి ముచ్చట్లు

 

వచ్చే సంవత్సరం హరితహారం  కార్యక్రమంలో మొక్కలు నాటడానికి గ్రామాల వారిగా స్థలాలను  ఎంపిక చేసి, ఎన్ని మొక్కలు నాటుతారో వివరాలు తయారు చేసి నివేదికను    మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. మంగళవారం జనహిత భవనంలో హరితహారం కార్యక్రమం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా వచ్చే ఏడాది నాటే మొక్కల వివరాలను  తెలియజేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ లో మొక్కలు నాటే స్థలాలను  ఎంపిక చేసి, ఎన్ని మొక్కలు నాటుతారో వివరాలను జిల్లా స్థాయి అధికారులకు తెలపాలని పేర్కొన్నారు. ఆరో విడత హరితహారం లో నాటిన మొక్కల కు జియో ట్యాగింగ్ ను త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన మొక్కలు నర్సరీలలో పెంచుకోవాలని పేర్కొన్నారు.   కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డి ఆర్ డి ఓ చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి వసంత, అధికారులు పాల్గొన్నారు.

 

పచ్చదనం పెంపుదలకు ప్రజా ప్రతినిధులు,  అధికారులు కృషి చేయాలి 

Tags:Details of plants to be planted in the green belt next year should be stated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *