Natyam ad

పులివెందులలో దేవర ఉత్సవాల రోడ్డు శాశ్వతంగా మూసివేత

పులివెందుల పట్టణానికి అరిష్టం అంటున్న పీఠాధిపతులు
ఖాతరు చేయని అధికారులు
బద్వేలు

 

పులివెందుల ముచ్చట్లు:

పులివెందుల పట్టణంలో దేవర ఉత్సవాలు నిర్వహించే రోడ్డును శాశ్వతంగా మూసివేసే చర్యలు అధికారులు చేపడుతున్నారు .దీనివల్ల పులివెందులకు పెద్ద ఎత్తున ఆపద అరిష్టo ముంచుకు వస్తాయని పీఠాధిపతులు, స్వామీజీలు హెచ్చరిస్తున్నారు. గతంలో ఈ నిర్మాణాలు  చేపట్టవద్దని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు ఎంపీ ఆదేశాలను తుంగలోకి తొక్కి రోడ్డును మూసివేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో మరోమారు పులివెందుల పట్టణ ప్రజలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాక ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లతోపాటు వివిధ పార్టీల ప్రతిపక్ష నేతలకు లేఖలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రాష్ట్రపతికి కూడా ప్రత్యేక సంతకాలతో కూడిన లేఖను పంపేందుకు హిందూ సంఘాలు నిర్ణయించుకున్నాయి..పులివెందులలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దేవర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పులివెందుల ప్రజలు చల్లగా ఉండాలని నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి పులివెందుల పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ లో వెలసిన శ్రీ పోలేరమ్మ బంగారు అంగళ్ళ వీధిలో వెలసిన పెద్దమ్మ, అంకాలమ్మ పేటలో వెలసిన శ్రీ అంకాలమ్మ దేవత లను కొలిచేందుకు వందల సంవత్సరాల నుంచి ఒకే రోడ్డు ఉంది. ఈ ముగ్గురు అమ్మవార్లను దేవర సమయంలో పూజించుకుంటారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు అమ్మవార్లు వెలసిన రోడ్డు మీదుగా సిరి బండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అయితే స్థానిక  పడమటి వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న ఈ దేవర ఉత్సవ రోడ్డును అభివృద్ధి నిర్మాణాల పేరుతో శాశ్వతంగా మూసివేశారు.

 

 

Post Midle

దీనిపై పులివెందుల పట్టణ ప్రజలు హిందూ సంఘాలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో  ఈ రోడ్డు మూసివేసే నిర్మాణాలు చేపట్టేటప్పుడు హిందూ సంఘాలు, దేవర ఉత్సవ కమిటీ నాయకులు, పట్టణ ప్రజలు  స్థానిక నాయకులను  కలిసి రోడ్డును మూసి వేయవద్దని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో తాము రోడ్డును మూసివేయమని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. కానీ మళ్లీ ఆ హామీని తుంగలోకి తొక్కుతూ రోడ్డును పూర్తిగా మూసివేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అసలు పులివెందులలో పనిచేస్తున్న అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులను, నాయకులను ఖాతరు చేయడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. వారు చెప్పినా కూడా రోడ్డును శాశ్వతంగా మూసివేసే చర్యలు చేపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేవర రోడ్డును యథా తథంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంపీ అవినాష్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డును మూసివేస్తే పులివెందలానికి పెద్ద ఎత్తున అరిష్ఠం కలుగుతుందని, పట్టణానికి అమ్మవారి శాపం తగులుతుందని హిందూ పీఠాధిపతులు స్వామీజీలు పేర్కొంటున్నారు. ప్రజలు, భక్తులు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

 

 

గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే పెద్ద ఎత్తున ఈసారి శాంతియుతంగా ఉద్యమిస్తామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు అధికారులకు లేఖలు రాస్తున్నారు .అలాగే రాష్ట్రపతికి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
అభివృద్ధి పేరుతో అధికారులు  గ్రామ దేవతల చల్లని చూపుల కోసం ప్రజలు సుభిక్షంగా సిరి సంపదలతో  తుల తూగుతూ ఉండాలని చేస్తున్న దేవర ఉత్సవాలకు  ఆటంకాలు కలిగించి  హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే  అధికారుల లక్ష్యమా? అని పట్టణంలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పట్టణ ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా తగిన చర్యలు నాయకులు తీసుకోవాలని లేకపోతే ఈ సమస్యను వదిలే ప్రసక్తే లేదని పట్టణ ప్రజలు, హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి.

 

Tags: Devara Utsava road in Pulivendulu is permanently closed

Post Midle

Leave A Reply

Your email address will not be published.