100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే పై కురుస్తున్న ప్రశంసల జల్లులు

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకుని నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో నిలిచే గొప్ప మానవతావాది అయిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల్లో ఒక రకమైన భావన నెలకుంటున్న ఈ తరుణంలో ప్రభుత్వ ఆస్తిని కాపాడి నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలా ఉండాలి అని చూపే మార్గదర్శిగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిలిచారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో ఉన్న నల్లగుట్టను కాపాడడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అడ్డాకుల మండలంలో అడవుల విస్తీర్ణం కోసం భూములను ఇచ్చిన ఓ ప్రైవేటు వ్యక్తికి అంతే మొత్తంలో భూమిని కేటాయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా అధికారులు నల్ల గుట్టలో దాదాపుగా 100 కోట్లకు పైగా విలువైన 28 ఎకరాల పొలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తికి కేటాయించే విధంగా అధికారులు ఆగమేఘాలపై సర్వే చేశారు. ఈ సర్వే జరిగే సమయంలో అమెరికా పర్యటనల్లో ఉన్న ఎమ్మెల్యే ఆళ వెంకటేశ్వర రెడ్డికి స్థానిక ప్రజలు ఈతంగాన్ని గురించి సమాచారం ఇచ్చారు. తాను వచ్చేవరకు ఈ భూమి కేటాయింపు వ్యవహారాలను ఆపాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు.

 

 

 

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన వెంటనే జిల్లా అధికారులతో ఈ భూముల కేటాయింపు పై సమాలోచనలు జరిపి వివరాలు సేకరించారు. భూమి కేటాయింపు విషయాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తక్షణమే హైదరాబాదులోనే  ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మంత్రి మరియు ఎమ్మెల్యే ఈ భూ కేటాయింపు వ్యవహారాన్ని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ విలువైన భూముల్ని ప్రజల అవసరాలకు కోసం కాకుండా ప్రైవేటు వ్యక్తికి ఇవ్వడం సరికాదని వెంటనే ఆ ఉత్తర్వులు నిలిపివేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ మహబూబ్నగర్ జిల్లా అధికారులతో ఈ విషయం గురించి ఆరా తీసి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశాన్ని విరమించుకోవాలని సూచించినట్లుగా సమాచారం. దీంతో మహబూబ్నగర్ జిల్లా ఉన్నతాధికారులు నల్లగుట్ట భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశాన్ని విరమించుకుంటున్నట్లుగా శనివారం రాత్రి ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

 

Tags: Devarakadra MLA Ala Venkateshwar Reddy saved government land worth 100 crores Showers of praise on MLA

Leave A Reply

Your email address will not be published.