చిరంజీవితో దేవరకొండ డయాస్

Devarakonda Diaras with Chiranjeevi

Devarakonda Diaras with Chiranjeevi

Date:07/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో బోలెడంత ఆసక్తి. దాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘గీత గోవిందం’కు భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ఆడియో విడుదల వేడుకకు అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చిన నిర్మాతలు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తున్నారట. దీంతో ఒకే వేదికపై చిరంజీవి, విజయ్ దేవరకొండను అభిమానులు చూడబోతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ‘ఛలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి మరింత ప్రచారం కల్పించేందుకు ఈనెల 12న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తు్న్నారు. ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు కాబట్టి.. ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో జరపాలని నిర్మాతలు నిర్ణయించారట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సినిమాను సమర్పించేది అల్లు అరవిందే కాబట్టి ఆయన ఆహ్వానిస్తే చిరంజీవి తప్పకుండా వస్తారని ఫిల్మ్ నగర్ టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Tags:Devarakonda Diaras with Chiranjeevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *