Natyam ad

త్రిశూల స్నానం ఉత్సవం ఏర్పాట్లు పరిశీలన దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

శ్రీకాళహస్తి ఆలయ ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పుష్కర వేడుక ఉత్సవాన్ని నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సువర్ణముఖి నది లో పుష్కరుడు కొలువు తీరుతున్న వేళ ఏటి ఉత్సవం పేరిట త్రిశూల ఉత్సవం నిర్వహిస్తారు. సద్యో ముక్తి వ్రత పూజలు నిర్వహిస్తారు.. ఈ మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక జల వినాయకుడికి సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున పంచమూర్తులు కొలువు తీర్చి పూజలు నిర్వహించడానికి ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో శాశ్వత వేదిక నిర్మాణం చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు సూచనల మేరకు భక్తులందరికీ పంచమూర్తుల దర్శనం లభించి భక్తులు సౌకర్యంగా కూర్చునే విధంగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ శాఖ చేపట్టారు. పంచమూర్తులను కొలువు తీర్చడానికి గతంలో లేని విధంగా 40-50 స్థలము విస్తీర్ణంలో విశాలంగా వేదిక ఎక్కడ క్వాలిటీ ఎక్కడ దెబ్బ తినకుండా నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా నది ఒడ్డున భక్తులందరూ కూర్చొని ఉత్సవం తిలకించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

 

అదేవిధంగా నదిలో పుష్కరుడు కొలువుతీరిన వేళ సర్వేశ్వరుడు కూడా త్రిశూల రూపంలో స్నానం ఆచరించేందుకు ప్రత్యేక కొలను ఏర్పాటు చేసి స్నానకట్ట వద్ద ఎలాంటి తోపులాటకు లేకుండా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా ఉత్సవానికి విచ్చేసే భక్తులు త్రిశూల స్నానం సమయంలో స్నానాలు ఆచరించేందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించి, ఇంజనీరింగ్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా చక్కటి ఏర్పాట్లు ఉండాలని దేవస్థానం అధికారులను చైర్మన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈఈ మురళీధర్ రెడ్డి, ఏఈ కిషోర్, రాజేశ్వరి, వర్క్ఇన్స్పెక్టర్ ప్రతాప్, సూర్య ప్రసాద్, మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Devasthanam Board of Trustees review arrangements for Trishul Bathing Festival

Post Midle