Natyam ad

అభివృద్ధి కేరాఫ్‌ వైఎస్సార్‌సీపీ- మంత్రి పెద్దిరెడ్డి

-రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేసి రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. గురువారం ఆయన పట్టణంలోని ఎంబిటి రోడ్డు, కొత్తయిండ్లు, ఎల్‌ఐసీ కాలనీ, కొత్తపేట, సాయిబాబాగుడివీధి ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి అప్యాయంగా ప్రజలను పలకరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలువురిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కి మహిళలు నీరాజనాలు పలికారు. మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కరపత్రాలు పంపిణీ చేసి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్య్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న పథకాలతో బడుగు బలహీన వర్గాల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించారని కొనియాడారు. పుంగనూరు నియోజకవర్గంలో బైపాస్‌రోడ్డు, మిని బైపాస్‌రోడ్డు, సబ్‌ స్టేషన్ల ఏర్పాటు, ఓవర్‌ హెడ్‌ట్యాంకులు, ఆర్‌వో ప్లాంట్లు, వీధులు, కాలువల నిర్మాణంతో పాటు అన్ని గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేసి , వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌లు నిర్మించి, ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీఠ వేశామన్నారు.

 

 

 

అలాగే పట్టణంలో ఎంబిటి రోడ్డును విస్తరించి, ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటిలో విద్యుత్‌ చార్జీలు తగ్గించేందుకు సోలార్‌ ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. 6 పార్కులు ఏర్పాటు చేసి, ప్రజల మానసిక ఉల్లాసానికి తోడ్పాటునందించామన్నారు. అలాగే పుంగమ్మ చెరువు కట్ట, సుబ్బమ్మ చెరువు కట్ట లను విస్తరించి కర్నాటక జాతీయ రహదారిని పుంగనూరుకు అనుసందానం చేశామన్నారు. 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదు సంవత్సరాలలో చేసి చూపిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ప్రతి ఒక్కరు రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రచార కర్తలుగా ఉధ్యమించి, పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము , మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర తో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు , అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: Development Caref YSRCP- Minister Peddireddy

Post Midle