నాలుగేళ్ల నుంచి కనిపించని  అభివృద్ధి మండలి మీటింగ్

Date:08/11/2018
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ జిజిహెచ్‌ పేదల ఆరోగ్యానికి పెద్ద భరోసాగా నిలుస్తుంది. అయితే కొంతకాలంగా సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆసుపత్రిలో కీలక సమస్యల పరిష్కారానికి ఆయువుపట్టుగా నిలవాల్సిన ఆసుపత్రి అభివృద్ధి మండలి జాడ నాలుగేళ్లుగా కనిపించడం లేదు. దీంతో అనేక సమస్యలు రోగులను చుట్టుముడుతున్నాయి.
కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించాల్సిన హెచ్‌డిఎస్‌ కనుమరుగవ్వడంతో సామాన్యులకు అవస్థలు తప్పడంలేదు.రోజుకు మూడు వేల నుంచి 3,500 మంది మంది మంది మంది రోగులు వచ్చే కాకినాడ జిజిహెచ్‌ లో సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జబ్బులతో వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో లోనూ, పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను గుర్తించి, తగు చర్యలను చర్చించి వాటి పరిష్కారానికి గతంలో కృషి జరిగేది. కలెక్టర్‌ చైర్మన్‌గా, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ కన్వీనర్‌గా 2014కి ముందు ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశాలు 90 రోజులకొకసారి జరిగేవి. ఈ హెచ్‌డిఎస్‌కి ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపీ, జెడ్‌పి చైర్మన్‌ కూడా హాజరయ్యేవారు. వీరితోపాటు జిజిహెచ్‌లో హెచ్‌ఒడిలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, నామినేట్‌ అయిన ముగ్గురు స్వచ్ఛంద సంస్థ, సామాజిక కార్యకర్తలు, కార్మికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా విధిగా వచ్చేవారు.
చేసిన పనులను ప్రస్తావిస్తూ, చేయబోయే అభివృద్ధి పనులు గురించి చర్చల ద్వారా కలెక్టర్‌ సమక్షంలో సమస్యల వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించేవారు. అప్పట్లో ఏడాది కాలంలో నాలుగు సమావేశాలు జరిగేవి. అనేక సమస్యలు కూడా పరిష్కారమయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సైతం హెచ్‌డిఎస్‌ తీర్మానాలను పంపేవారు. 1,065 పడకలు కలిగిన జిజిహెచ్‌లో ముందు 1,500కు, తర్వాత 1,900కు, చివరికి 2,300కు పడకల స్థాయిని పెంచాలని తీర్మానాలను ప్రభుత్వానికి గతంలో పంపారు.
అయితే వాటిని అమలు చేయాలనే ఒత్తిడి ఇప్పుడు ప్రభుత్వంపై తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా గతంలో హెచ్‌డిఎస్‌ తీర్మానంతోనే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించారు. దీంతో వైద్యసేవలు విస్తరించబడ్డాయి. అయితే ప్రస్తుతం హెచ్‌డిఎస్‌ సమావేశాలను తూతూమంత్రంగా జరుపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం ఆసుపత్రి సూపరింటెండెంట్‌, హెచ్‌ఒడిలు మాత్రమే సమావేశాలను జరిపి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మీడియాకు సైతం సమాచారం లేకుండా మీటింగ్‌లు జరుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Tags: Development Council meeting which has not been seen since four years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed