Natyam ad

పుంగనూరులో ప్రజల సహకారంతోనే అభివృద్ధి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల సహకారంతోనే అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి ఆయన మండలంలోని వెహోరుంపల్లె, జెట్టిగుండ్లపల్లె గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను లబ్ధిదారులకు అందజేసి , సంక్షేమ పథకాలు అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆదేశాల మేరకు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్‌ సెంటర్లు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే ప్రస్తుతం ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం, ఆర్‌వోఆర్‌ ప్లాంట్ల నిర్మాణాలతో పాటు పల్లెలో పూర్తికాబడిన సిమెంటురోడ్లు, కాలువలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అన్ని రకాల సమస్యలు ఇంటి వద్దనే పరిష్కరించడం జరుగుతోందన్నారు. సచివాలయాల పనితీరు చరిత్ర సృష్టించిందని కొనియాడారు. గడప గడపకు కార్యమ్రంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వనజమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి, రామమోహన్‌రెడ్డి, కొత్తపల్లె చెంగారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, అయూబ్‌ఖాన్‌, సురేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి ,రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్‌బాషా, రమణ, సుబ్రమణ్యం తదితరులుపాల్గొన్నారు.

Post Midle

 

Tags: Development in Punganur is with the cooperation of people – MPP Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.