Natyam ad

బోయకొండ లో అభివృద్దిపనుల ప్రారంభోత్సవాల జాతర

–మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిచే ప్రారంభోత్సవాలు
— ఊరూరా ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
— బోయకొండతోపాటు మూడు చోట్ల సచివాలయభవనాలు ప్రారంభోత్సవం
–రూ:20 కోట్ల తో చేపట్టిన పనులు ప్రారంభోత్సవం

చౌడేపల్లె ముచ్చట్లు:


పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం,బోయకొండ గంగాపురంలో కోట్లాది రూపాయాల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్దిపనుల ప్రారంభోత్సవ జాతర సోమవారం నెలకొంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంఎల్‌సీ భరత్‌ తో కలిసి మంత్రి పనులను ప్రారంభించారు. మేళ తాళాల నడుమ ప్రారంభోత్సవ వేడుల వద్ద మహిళల మంగళ హారతులతో స్వాగతించారు. ఆలయంలో సుమారు రూ:17 కోట్ల వ్యయంతో చేపట్టిన భక్తులవిశ్రాంత భవనాలు, క్యూలైన్ల ఆధునీకరణ,ఆలయ కార్యాలయం,గోకులం, గోశాల,పొంగల్‌ షెడ్లు,షాపింగ్‌ కాంప్లెక్స్ పనులతో పాటు సిమెంటురోడ్డుమరియు కాలువల నిర్మాణం, 160 కేవిఏ సామర్ద్యం గల ట్రాన్స్ఫార్మర్‌, విధ్యుత్‌ దీపాలు, ఆధునీకరణ పనులను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఆప్యాయతాలను పంచుతూ గ్రామస్థులను పలకరిస్తూ ప్రారంభోత్సవ వేడుకలు ముందుకు సాగాయి.

Post Midle

సచివాలయ సేవలను సద్వినియోగం చేసుకోండి…..
ప్రభుత్వం పేదలకు సకాలంలో ప్రభుత్వసేవలను అందించడం కోసం ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. దిగువపల్లె, కొండామర్రి, ఆమినిగుంట గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసాకేంద్రాలు, వైఎస్సార్‌ క్లినిక్‌ కేంద్రాలను మంత్రి పెద్దిరెడ్డి , ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి తదితరుల తో కలిసి ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల్లో కూరగాలయతో రూపొందించిన చిత్రాలను పరిశీలించిన మంత్రి సిబ్బందిని అభినందించారు. ప్రజలకు సకాలంలో సేవలందిప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలోవైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు,•మాజీ ఎంపీపీలు అంజిబాబు, రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ,వెస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌,సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు సోని, జయసుధమ్మ, సావిత్రి ఎంపీటీసీలు గంగులమ్మ, షాహీనా, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంరదారెడ్డి,కడియాల నగేష్‌, నేతలు మణిరాజు, మురళీరాజు,రఘుపతినాయడు, మునికృష్ణమనాయుడు, నాగభూషణరెడ్డి, శ్రీనివాసులు, తదితరులున్నారు.

Tags: Development Inauguration Fair in Boyakonda

Post Midle