అభివృద్ధి నా ఆశయం-సంక్షేమమే నా సంకల్పం

-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్


వేములవాడ ముచ్చట్లు:

 


వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంలో విలీన గ్రామాలైన నాంపల్లి,అంజని నగర్ భగవంత రావు నగర్ తిప్పాపూర్ కోనయ్య పల్లి గ్రామాలలో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ అభివృద్ధి నా ఆశయం సంక్షేమమే నా సంకల్పం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన మిగిలిన కోట్ల అప్పులు తీర్చామని నరేంద్ర మోడీ తెలియజేశారు అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కుంభకోణాలు అవినీతి పాలన నడిచేదని నరేంద్ర మోడీ పాలన వచ్చాక పూర్తి పారదర్శకతో ఒక్క అవినీతి కూడా లేకుండా ఈ దేశం పరిపాలించబడుతుందని అన్నారు.నేను అధికారంలోకి వస్తే మొదటగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తానని.పాఠశాల దుస్థితి చూస్తే బాధగా ఉంది అన్నారు వాటిని కూడా మెరుగుపరిచి విద్యార్థుల కోసం అవసరమైతే సొంత నిధులు ఖర్చు చేసైనా పాఠశాలలో బాగు చేస్తానని తెలియజేశారు.తెరాస పాలనలో విద్యార్థుల బతుకులు ఆగమయాయని బంగారు తెలంగాణ కాదు కదా తెలంగాణ అయిందని ఆయన అన్నారు.తెరాస పాలకుల అసమర్ధ పాలన వలన అవినీతి పాలన వలన ఈరోజు కాలేశ్వరం లాంటి ప్రాజెక్టు నాణ్యతతో కట్టకపోవడం వల్ల ప్రజాధనం లక్షల కోట్లు వృధా అయిందని ఆయన అన్నారు.

 

 

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకముందే రెండవ ఫెజు ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థలను బాగుపరచడానికి నిధులు సమకూర్చిందని.రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దిశగా అడుగులు వేసిందని.ములుగులో గిరిజన యూనివర్సిటీ ప్రకటించి గిరిజన బిడ్డల విద్యకు సహకరించిందని.పసుపు బోర్డు తీసుకువచ్చి పసుపు రైతుల కళ్ళలో ఆనందం నింపిందని ఆయన అన్నారు తెలంగాణలో బిజెపి అధికారం లేకపోతేనే ఇన్ని మంచి పనులు చేస్తే ఒకసారి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి జరుగుతుంది అన్నది ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు.కనుక 30వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో డాక్టర్ చెన్నమనేని దీప, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు,జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం మధు,గంగరాజు, బిజెపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Development is my ambition-prosperity is my will

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *