Development Minister Peddi Reddy's goal

అభివృద్దే మంత్రి పెద్దిరెడ్డి ధ్యేయం

– ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్ రెడ్డి

Date:28/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

నియోజవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్యేయమని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుని ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఉరుస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్ భవనాల నిధుల నుంచి సుమారు రూ.2.60కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు పాత భవనం ఉన్న చోటే కొత్త ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణం చేపట్టడం కోసం పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవనాన్ని సర్వాంగ సుందరంగా నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ నాగరాజ రెడ్డి, పీఆర్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఈఈ శివ నరసింహ ప్రసాద్, ఏఈ సుబ్రహ్మణ్యం రెడ్డి, మురగప్ప, విశ్వేశ్వరరెడ్డి, బాబు, పెంచుపల్లి రెడ్డెప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణగా తెలంగాణ

Tags: Development Minister Peddi Reddy’s goal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *