కాంగ్రెస్ తోనే  అన్ని వర్గాల అభివృద్ధి

Development of all sections with Congress

Development of all sections with Congress

-మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Date:23/11/2018
మంథని ముచ్చట్లు:
 మంథని మండలం లోని లక్కీపూర్  గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం లో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు పలు గ్రామాలలో గడపగడపకు తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను  గెలిపించాలని  ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బీమా ను కొనసాగిస్తూ కౌలు రైతులను రైతులు గా గుర్తిస్తాం. రేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల సరుకులు పంపిణీీ చేస్తామన్నారు. దళితులకు మనిషికి 7 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. దివ్యాంగుల వివాహానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారు అదనపు గది నిర్మించుకుంటే రెండు లక్షల రూపాయలు నూతన గృహం నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.
ఏడవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ చదువుకునే ఆడబిడ్డలకు ఉచితంగా సైకిల్ ఇస్తామన్నారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వృద్ధాప్య , వితంతువులకు 2000 రూపాయల చొప్పున అలాగే వికలాంగులకు మూడు వేల రూపాయలు అందిస్తూ కుటుంబంలో ఇద్దరి చొప్పున పింఛన్లు ఇస్తామన్నారు. స్వశక్తి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ పేద కుటుంబాలకు సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మహా కూటమి నాయకులు మాదాడి శ్రీనివాస్ రెడ్డి , మెండే రాజయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో పలువురి చేరిక
మండలంలోని చిన్న ఓదాల గ్రామానికి చెందిన మాజీ. సర్పంచ్ నాగుల రాజయ్య ఉపసర్పంచ్ లింగాల చిన్న ఆశలు బూర్గుల రాకేష్ ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ వార్డు మెంబర్ చిట్టవేన పద్మ ,లతో ఓదేలు, కుమారస్వామి ప్రవీణ్ లతో సహా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిన్న ఉదాల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దువ్వాసి సమ్మయ్య సిద్ది తిరుపతి లు పాల్గొన్నారు.
Tags:Development of all sections with Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *