నవరత్నాలతో పేదప్రజల అభివృద్ధి

Development of poor people with navaratna

Development of poor people with navaratna

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం నవరత్నాలను ఏర్పాటు చేస్తున్నారని నియోజకవర్గ బూత్‌ కమిటి మేనేజర్‌ రెడ్డెప్ప , కో-ఆఫ్షన్‌మెంబర్‌ ఖాదర్‌బాషా గురువారం పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బన్నతో కలసి మండలంలోని బండ్లపల్లె, ధర్మవారపుపల్లె, బుర్రావారిపల్లె, సోసైటికాలనీలలో నవరత్నాల కార్యక్రమాన్ని ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి సూచనల మేరకు ప్రతి రోజు నవరత్నాలు కార్యక్రమాలను మండలంలో పర్యటిస్తున్నామన్నారు. నవరత్నాలలో రైతు భరోస, ఆరోగ్యశ్రీ క్రింద రూ.1000 లు ఖర్చు దాటితే ప్రభుత్వంచే వైద్యసహాయం, 60 సంవత్సరాల వారికి పెన్షన్లు రూ.2 వేలకు పెంపు, వికలాంగులకు రూ.3 వేలు, పేదలందరికి పక్కాఇల్లు, అమ్మబడి క్రింద ప్రతి తల్లికి సంవత్సరాకి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి మహాత్తర కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కంకణబద్దులైన వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్‌ఆర్‌సిపికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రామక్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌లు మంజులమ్మ, ఆగిస్తిరెడ్డి, నేతలు గురివిరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, బాలక్రిష్ణారెడ్డి, గాయిత్రి, సుకన్య, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వర్షంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు

Tags; Development of poor people with navaratna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *