పుంగనూరు మన్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ది – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు మున్సిపాల్టీను అన్ని విధాలుగా అభివృధ్ది ఛేస్తామని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం కమీషనర్‌ కెఎల్‌ వర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీభాషాల ఆధ్వర్యంలో రూ:15 లక్షలతో క్లాక్‌ టవర్‌ నిర్మాణం, అలాగే రూ:35 లక్షల మూడు పార్క్లు, జిమ్‌ సెంటర్‌ ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి శంకు స్థాపన చేసి పనులు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పార్క్లు, జిమ్‌ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు.అలాగే పుంగమ్మ చెరువు కట్టను వెడల్పు చేసి కట్టకు ఇరువైపులా వెహోక్కలు పెంచడం చేపడుతామన్నారు. వీటితో పాటు సమ్మర్‌ స్టోరేజ్‌ కట్టపై కూడా లైట్లు ఏర్పాటుచేసి వాకింగ్‌ ట్రాక్‌లు , బెంచిలు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి మున్సిపాల్టీలో మొక్కలు నాటే కార్యాక్రమం యుద్ద ప్రాతిపాధిక చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌,రేష్మా,కాలిదాసు, జెపి యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ……

పుంగనూరు డిపో నుంచి రొడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆరీ్ట సీ బస్సులను నడుపుతామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.గురువారం ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల సర్వీసులను ప్రారంభించారు.మంత్రి మాట్లాడుతూ పుంగనూరు నుంచి గ్రామీణ సర్వీసులను నడుపుతున్నామని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆటోలలో ఇతర వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాల భారీన పడకండి అని సూచించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Development of Punganur Municipality in all respects – Minister Peddireddy Ramachandrareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *