Natyam ad

పుంగనూరు మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ధి

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిలర్‌ మనోహర్‌ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశం మున్సిపాలిటి ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సిలర్‌ రెడ్డెమ్మ మాట్లాడుతూ జగనన్నమార్ట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని , దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సమావేశాలు తమ పరిధిలో లేవని , వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. జగనన్న మార్ట్పై చర్యలు తీసుకుని పకడ్భందిగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణాన్ని సర్వంగా సుందరంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఎంబిటి రోడ్డు విస్తర్ణ కార్యక్రమాలకు రూ.52 కోట్లు మంజూరైందని, పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే కౌండిన్య నది కాలువలో సిమెంటు కాలువలు నిర్మాణానికి రూ.20 కోట్లు విడుదలైందని , పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే పార్కు, చెరువుకట్ట విస్తర్ణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల లోపు పనులను పూర్తి చేసి, ఆదర్శపుంగనూరుగా మార్చుతామన్నారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Development of Punganur Municipality in all ways

Post Midle