రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి -ఎంపీ మద్దిల గురుమూర్తి.

తిరుపతి  ముచ్చట్లు:

రేణిగుంట విమానాశ్రయ అభివృద్ధిపై సుమారు గంటన్నర పాటు కొనసాగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని ప్రధానంగా అంతర్జాతీయ విమానాలు, డ్రీమ్ లైనర్, బోయింగ్ 777 లాంటి భారీ విమానాలు దిగేందుకు సమస్యగా ఉన్న “రన్ వే” కి సంబందించిన భూ సమస్యలు చర్చకు వచ్చాయని చెప్పారు.భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అవసరమని సాధారణ మరియు అసాధారణ పరిస్థితులలో విమానాలు రన్‌వేపై ల్యాండింగ్ చేయడానికి విమానాలకు మార్గదర్శకత్వం కోసం ఖచ్చితమైన డీసెంట్ గైడెన్స్ సిగ్నల్‌లను అందించడానికి ఉపయోగించబడుతుందని దీని ఏర్పాటుపై సాధ్యాసాద్యాల గూర్చి చర్చించామని తెలియజేసారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అన్ని సమస్యలను త్వరలో పరిష్కరించి విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ గారిని ఎంపీ గురుమూర్తి శాలువా కప్పి సన్మానించారు.ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్, తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్, మరియు విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Development of Renigunta International Airport – MP Maddila Gurumurthy.

Leave A Reply

Your email address will not be published.