కేంద్ర నిధుల వల్లే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి 

Development of rural areas in the state with central funds

Development of rural areas in the state with central funds

Date:15/08/2018
విజయవాడ  ముచ్చట్లు:
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అంతా కేంద్ర నిధుల వల్లే జరుగుతోందని.. కానీ చంద్రబాబు ఇదంతా తమ ఘనతగా చెప్పుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పది కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జెండా ఎగురవేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నా… ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మోదీ పాలన సాగుతుందని అన్నారు. చంద్రబాబుది ఎపుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనన్న కన్నా… 2014లో కాంగ్రెస్‌ను తిట్టి… ఇపుడు అదే కాంగ్రెస్‌ను పొగడటమే దీనికి నిదర్శనమని అన్నారు. రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ భవనాల కోసం 3,500 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందిస్తే… కేంద్రం 2,500 కోట్లు ఇచ్చిందని అయినా వాటిలో ఒక్కదానికి శంకుస్థాపన చేయలేదని ఆరోపించారు.
అమరావతి ఇటుకల పేరిట వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇపుడు అమరావతి బాండ్ల పేరిట నిధులు సేకరిస్తున్నారని అవి కూడా ప్రభుత్వంతో లబ్ది పొందాలని భావించే వారే కొనుగోలు చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.
Tags:Development of rural areas in the state with central funds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *