పుంగనూరులో పర్యాటకులను ఆకట్టుకునేలా ఆలయాలు అభివృద్ధి – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

 

పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆలయాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు కలసి మండలంలోని నెక్కుంది వద్ద గల శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయ పనులను పరిశీలించారు. ఆలయం వద్ద  రూ. 3.50 కోట్లతో జరుగుతున్న పుష్కరణి, ఆలయ అభివృద్ధి  పనులను పరిశీలించారు. పట్టణంలోని శ్రీ మాణిక్యవరదరాజస్వామి పుననిర్మాణ పనులు సుమారు రూ.2 కోట్ల ఖర్చు చేసి పనులు చేపట్టారు. వీటిని పరిశీలించారు. మంత్రి పెద్దిరెడ్డి ఈ మేరకు పనులను త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖాధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ పురాతన ఆలయాల అభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. అగస్తీశ్వరస్వామి ఆలయము, మాణిక్యవరదరాజస్వామి ఆలయం, హనుమంతురాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, దుర్గంకొండ, బోయకొండ తదితర ఆలయాలను అత్యంత సుందరంగా నిర్మిస్తున్నామన్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పుష్కరణి, పార్కులు, విశ్రాంత గదులు, పార్కింగ్‌ స్థలాలను కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పురాతన ఆలయాల మరమ్మతులకు కోట్లాది రూపాయలు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు దేవాదాయశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Development of temples in Punganur to attract tourists – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.