Natyam ad

జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం- పెద్దిరెడ్డి

-దిన్నుపాటిలో పెద్దిరెడ్డికి ఘన స్వాగతం

 

పులిచెర్ల ముచ్చట్లు:

Post Midle

పులిచెర్ల మండలం, ఎల్లంకి వారి పల్లి మరియు పోశంవారి పల్లి పంచాయతీలో జరిగిన మేము సిద్ధం కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం అన్నారు, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలులో ఉన్నాయన్నారు, అమలు కాని హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారు, కావున ప్రజలు చంద్రబాబు నాయుడుని నమ్మి మోసపోవద్దని తెలిపారు, మొన్నటి వరకు వాలంటరీ వ్యవస్థను తిట్టిన చంద్రబాబు, నేడు వారికి 5000 నుంచి 10000 ఇస్తామని తెలియజేస్తున్నాను, ఇలాంటి హామీలతో అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు, అదేవిధంగా రాష్ట్ర విడిపోవడానికి ప్రధాన కారణం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజనకు కారణమైన కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించి, వైసిపి ఎంపీ అభ్యర్థి అయిన మిథున్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరారు. అనంతరం దిన్నుపాటివారిపల్లెలోని అమ్మవారిని దర్శించుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. దిన్నుపాటివారిపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రానికి మహిళలు, యువత హారతి, పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విరుపాక్షి జయచంద్ర రెడ్డి, పృథ్వి రెడ్డి, సైఫుల్ల, రాజమూర్తి, రాజేంద్ర, రూకేష్, బారేషా, చౌదరి, దొరస్వామి, మాజీ సర్పంచ్ వెంకటేష్, తడికరా జయచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Development of the state is possible only with Jagan- Peddireddy

Post Midle