కేంద్ర సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.

మదనపల్లె ముచ్చట్లు:

పీఎం నరేంద్ర మోడీ సహకారంతో దేశం అభివృద్ధి చెందుతుందు తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. మదనపల్లి సొసైటీ కాలనీ బిజెపి కార్యాలయంలో ఆయన బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింద న్నారు. రైతులకు కిసాన్ యోజన నిధులు, జాతీయ రహదారులు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాయాలు, జాతీయ రహదారులు వంటి అనేక సంక్షేమ పథకాలే కాకుండే దేశాన్ని అగ్రగామిగా నిలిపిందన్నారు. రాష్ట్రంలో వైసిపి అవినీతి, అరాచక పాలన తాండవిస్తోంద న్నారు. రాజంపేట పార్లమెంట్ బిజెపి అభ్యర్థి, మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎల్లంపల్లి ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, చల్లపల్లి నరసింహారెడ్డి, ఆనంద్, జర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Development of the state with central cooperation..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *