Natyam ad

ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించేలా తిరుమల పార్కుల అభివృద్ధి

– వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 పార్కును ప్రారంభించిన టీటీడీ చైర్మన్

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

తిరుమలలో భక్తులు అడుగుపెడుతూనే వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్   వై వి సుబ్బారెడ్డి చెప్పారు .మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఆనుకుని పునర్నిర్మించిన పార్కును చైర్మన్  సుబ్బారెడ్డి టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తో కలసి శుక్రవారం ప్రారంభించారు .ఈ సందర్బంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు . ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు . తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి పక్కాగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు . అలాగే దాతల సహకారంతో పార్కులన్నీ పెద్ద ఎత్తున పునర్నిర్మిస్తున్నామని , దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ మరింతగా జరుగుతుందన్నారు . అలాగే తిరుమలకు 50 విద్యుత్ బస్సులు నడిపేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఆర్టీసీ కి బస్సులు అందే ఏర్పాటు చేశారని చైర్మన్ తెలిపారు .

 

 

ఇందులో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీ 10 విద్యుత్ బస్సులను సి ఎం ప్రారంభిస్తారని వివరించారు . 27వ తేదీ తిరుపతిలో కరకం బాడి వైపునుంచి నుంచి వాసవి భవన్ వరకు నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారన్నారు . బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి 28వ తేదీ ఉదయం నూతన పరకామణి భవనం ప్రారంభిస్తారని చైర్మన్ తెలిపారు . రెండున్నరేళ్ల తరువాత భక్తుల మధ్యన స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందువల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు . ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు .పార్కు పునర్నిర్మాణ దాత హైదరాబాద్ కు చెందిన  రవికుమార్ , ఆయన కుటుంబ సభ్యులు , సివిఎస్వో నరసింహ కిషోర్ , చీఫ్ ఇంజినీర్  నాగేశ్వర రావు , ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి , గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ , విజివో  బాలిరెడ్డి పాల్గొన్నారు .

పార్కుల పరిశీలన
అనంతరం చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఈవో  ఎ వి ధర్మారెడ్డి తిరుమలలో నారాయణగిరి , స్పెషల్ టైప్ ,జిఎన్ సి , గీతాపార్కు , శ్రీ పద్మావతి అథితి గృహం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు .

Tags: Development of Tirumala parks for spiritual enjoyment

Post Midle