నవరత్నాలతో మహిళల అభివృద్ధి సాధ్యం

Development of women with Navaratnam

Development of women with Navaratnam

– మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి •వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమంతోనే మహిళల అభివృద్ధి సాధ్యమౌతుందని మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. గురువారం వెలుగు ఏపిఎం హరిక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళా సమాఖ్యల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. గ్రామ సంఘాల భవన నిర్మాణాలకు , పాలశీతలీకరణ కేంద్రానికి శాశ్వతభవన నిర్మాణం, మహిళలకు కుట్టుశిక్షణా కేంద్రం ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులు మంత్రి ద్వారా మంజూరు చేయిస్తామన్నారు. నవరత్నాలను పకడ్బంధిగా అన్ని వర్గాలకు అందించేందుకు మహిళా సమాఖ్యలు కృషి చేసి, భాగస్వామ్యులుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపిపి నరసింహులు, మాజీ వైస్‌ఎంపిపి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఖాదర్‌బాషా, హేమచంద్ర, రాధ, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, సంఘమిత్రలు వసంతమ్మ, చిన్నప్ప, శీనప్ప తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటి …

మండల సమాఖ్య అధ్యక్షురాలుగా జానకమ్మను , కార్యదర్శిగా భార్గవి, కోశాధికారిగా మంజుల ను ఎన్నుకున్నారు. జానకమ్మ మాట్లాడుతూ మండల సమాఖ్యలను బలోపేతం చేసి, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని తెలిపారు.

భార్యపై భర్త కత్తితో దాడి

Tags: Development of women with Navaratnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *