పుంగనూరులో విస్తరణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు- కమిషనర్‌ నరసింహప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని విస్తరణ ప్రాంతాలలో మౌళిక వసతులు కల్పించేందుకు పరిశీలన చేస్తున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తో కలసి 3వ వార్డులోని శాంతినగర్‌, సూర్యనగర్‌, ఎల్‌ఐసీ విస్తరణ కాలనీ ప్రాంతాలను సందర్శించారు. కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి పైపులైన్ల ఏర్పాటుకు పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు విస్తరణ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపల్‌ నిధుల నుంచి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండ చె త్తకుండీలలో వేయాలని కోరారు. అలాగే ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటసుబ్బయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు లక్ష్మణరాజు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

 

Tags; Development programs in expansion areas in Punganur- Commissioner Narasimhaprasad

Leave A Reply

Your email address will not be published.