పుంగనూరులో రూ.3.37 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు – చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.3.37 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం ఆయన కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించామన్నారు. ఇందులో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ప్రణాళిక లు సిద్దం చేశామన్నారు. 31 వార్డుల్లో అవసరమైన పనులను గుర్తించి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో మంచినీటికి కోటిరూపాయలు, రోడ్లు, కాలువలు, వీధుల ఏర్పాటుకు రూ.1.37 కోట్లు, బజారువీధిలో బీటీరోడ్డుకు రూ.35 లక్షలు , ఎంఎస్‌ఆర్‌ రోడ్డుకు రూ.15 లక్షలు కేటాయించామన్నారు. మంత్రి ఆదేశాల మేరకు రూ.55 లక్షలతో పుంగమ్మ చెరువు కట్టపై పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు , మంచినీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఈఈ మహేష్‌, ఏఈ కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Development programs in Punganur with Rs.3.37 crore – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.