పుంగనూరు మున్సిపాలిటిలో అభివృద్ధి పరుగులు -పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో అభివృద్ధి పరుగులు తీస్తోందని పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ అన్నారు. మంగళవారం చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టణంలోని కొత్తయిండ్లు, తిరుపతి రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు జగనన్నబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ పుంగనూరు అభివృద్ధిని గత ప్రభుత్వాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. పట్టణంలో బైపాస్‌రోడ్డు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటుతో పాటు వెంటిలేటర్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో సిలిండర్ల ప్యాక్టరీ, పైపుల ప్యాక్టరీ, ఫీడ్‌ప్యాక్టరీతో పాటు నూలువల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, నరసింహిలు, జెపి.యాదవ్‌, కాళిదాసు, రామకృష్ణంరాజు, సాజిదా, యువకుమారి, మమతారాణి , జయభారతి, భారతి, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags: Development Runs in Punganur Municipality -PKM UDA Chairman Venkata Reddy Yadav

Leave A Reply

Your email address will not be published.