వైఎస్సార్సీపీలో అభివృద్ధి పరుగులు
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పరుగులు తీస్తోందని మున్సిపల్ చైర్మన అలీమ్బాషా అన్నారు. శుక్రవారం నక్కబండలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్తో కలసి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాల పంపిణీపై ఆరా తీశారు. చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పుంగనూరు అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించారని కొనియాడారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నక్కబండ అభివృద్ధికి రూ.14 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని పేదలందరికి సంక్షేమ పథకాలు అందించి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరీఫ్, వైస్ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు మనోహర్, పూలత్యాగరాజు, అమ్ము, కిజర్ఖాన్, కసీరున్నిసా, నయీంతాజ్, భారతి, రెడ్డెమ్మ, తుంగామంజునాథ్, అర్షద్అలి, రామకృష్ణంరాజు, నరసింహులు, జెపి.యాదవ్, రేష్మా, కాళిదాసు, రాఘవేంద్ర, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

Tags; Development runs in YSRCP
