పుంగనూరులో అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలి – స్పెషలాఫీసర్‌ రాజశేఖర్‌నాయుడు

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని స్పెషలాఫీసర్‌ , జిల్లా ఎస్‌సీ కార్పోరేషన్‌ ఈడీ రాజశేఖర్‌నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలోని ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు 98, ఆర్‌బికెలు 96, వెల్‌నెస్‌ సెంటర్లు 71, మిల్క్చిల్లింగ్‌యూనిట్లు 78 లను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంజూరు చేయించారన్నారు. ఈ నిర్మాణాలు ఆగస్టు 31లోపు వందశాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు, సంబంధిత శాఖల వారు పనిచేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించకుండ ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు పనులు పూర్తి చేసి, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలుచేయాలని, ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి, డీఈ ప్రసాద్‌, ఏఈ సుబ్రమణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Development work in Punganur should be completed soon – Specialist Rajasekhar Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *