పుంగనూరులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి -చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని చైర్మన్ అలీమ్బాషా అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యదర్శి ఫకృద్ధిన్షరీఫ్తో కలసి హనుమంతురాయునిదిన్నెలో పైపులైన్ల పనులు, పట్టణంలోని పీఎల్ఆర్ రోడ్డు వద్ద కాలువ పనులను పరిశీలించారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు విస్తర్ణ ప్రాంతాలలో కూడ కాలువలు, వీధులు , మంచినీటి పైపులైన్లు, విద్యుత్ద్దీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు వీటిపై దృష్టి సారించి, తక్షణమే పనులు పూర్తి చేయించాలని సూచించారు. అలాగే విస్తర్ణ ప్రాంతాలలో అవసరమైన పనులు గుర్తించి నివేదికలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్శాఖను ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సచివాలయాల ద్వారా పారిశద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈ శశికుమార్, వైఎస్సార్సీపీ నాయకులు మహబూబ్బాషా, శ్రీనివాసులు, కాంట్రాక్టర్ కొండవీటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Development work in Punganur should be expedited – Chairman Aleem Basha