పుంగనూరులో రూ.20 కోట్లతో మున్సిపాలిటిలో అభివృద్ధి పనులు

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని 31 వార్డుల్లోను అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు సుమారు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసి పంపినట్లు రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. గురువారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్సక్నగర్‌, దోబీకాలనీ, బైపాస్‌రోడ్డు, షిరిడిసాయినగర్‌, కోర్టురోడ్డులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్నబావుట బుక్‌లెట్లను విడుదల చేసి పంపిణీ చేశారు. నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక నిధులతో మున్సిపాలిటిలో రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. కాలువలు, వీధులు, రోడ్ల ఏర్పాటుతో పాటు విస్తరణ ప్రాంతాలలో విద్యుత్‌ లైన్లు కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. గడప గడపకు పర్యటనలో వస్తున్న వినతులను స్వీకరించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు త్యాగరాజు, అమ్ము, అర్షద్‌అలి, నరసింహులు, నటరాజ, కిజర్‌ఖాన్‌, కాళిదాసు, జెపి.యాదవ్‌, రేష్మా, ఆదిలక్ష్మీ, భారతి, విజయభారతి, సాజిదా, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags: Development works in Punganur municipality with Rs.20 crores

 

Leave A Reply

Your email address will not be published.