Natyam ad

పుంగనూరులో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి- ఎస్‌ఈ నాగజ్యోతి

పుంగనూరు ముచ్చట్లు:

జలజీవన్‌ ,నాడు-నేడు అభివృద్ధి పనులను తక్షణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్యూజ్లిఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్‌డబ్యూజ్లిఎస్‌డీఈఈ వెంకటేశ్వర్లుతో కలసి ఆమె మండలంలోని చండ్రమాకులపల్లె, ఈడిగపల్లె, పూజగానిపల్లె, ఒంటిమిట్ట, సుగాలిమిట్ట గ్రామాల్లో పర్యటించారు. జలజీవన్‌ మిషన్‌ క్రింద నిర్మిస్తున్న మంచినీటి పథకాలను, ఆర్‌ఓఆర్‌ ప్లాంట్లను , నాడు-నేడు పనులను ఆమె పరిశీలించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మండలంలో 40 మంచినీటి పథకాల నిర్మాణాలలో 35 ప్రారంభించడం జరిగిందన్నారు. మిగిలినవి ప్రారంభించాలన్నారు. పనులను పూర్తి చేసి ప్రజలకు మంచినీటి సమస్య లేకుండ చేయాలన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Post Midle

Tags: Development works should be accelerated in Punganur- SE Nagajyoti

Post Midle

Leave A Reply

Your email address will not be published.