అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

-వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
Date:16/03/2018
వరంగల్ ముచ్చట్లు:
ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్నందున  అభివృద్ధి పనులు వేగంగా చేయాలని, చేసే పని కనపడే విధంగా ఉండాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలని  ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై నందన గార్డెన్స్ లో ప్రారంభమైన సమీక్షా సమావేశానికి అయన హజరయ్యారు.  ఈ సందర్బంగా అయన కొత్తగా వచ్చిన జయశంకర్ జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్, జనగామ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ సీపీ గౌతమ్ లను సమావేశంలో అందరికీ పరిచయం చేసారు. సమావేశంలో అయన మాట్లాడుతూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు. వీటిని దేశం మొత్తం ప్రశంసిస్తోంది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినపుడు వాటిని పరిష్కరించాలన్నారు. కలెక్టర్లకు సొంత అజెండాలు ఉండొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండానే కలెక్టర్ల ఎజెండాగా ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలే మీ పథకాలుగా చేసుకొని వాటిని వేగంగా పూర్తి చేసే విధంగా మీ పని తీరు ఉండాలి అని చెప్పారు. మొదటి పోస్టింగ్ లో  మీ పని బాగుంటే మీకు మంచి పేరు వస్తుంది, అదే విధంగా భవిష్యత్ లో లైమ్ లైట్ పోస్టింగ్ లు వస్తాయని  అన్నారు. ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కష్టపడి పని చేయాలి అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఇద్దరం మంత్రులం మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టమని మీకు అన్ని విధాలా అండగ ఉంటాము అని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తెలుగు వెలుగు అనే ఉగాది పుస్తకాన్ని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లా పౌర సంబంధాల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమీక్ష సమావేశం లో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ఏఎర్రబెల్లి దయాకరరావు, దాస్యం వినయ్ భాస్కర్, మిషన్ భగీరథ ఈ అండ్ సి సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Development works should be accelerated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *