అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:

జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ఉపాధి హామీ పథకం, నాడు-నేడు, అర్బన్ హెల్త్ క్లినిక్స్, గృహ నిర్మాణాల పురోగతి, టిడ్కో రిజిస్ట్రేషన్లు, జగనన్న భూ హక్కు భూ రక్షా, స్పందన అర్జీలు, ల్యాండ్ ఆక్యుపేషన్ తదితర అంశాలపై.. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి.. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు.. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జిల్లా జాయింట్ కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లు హాజరయ్యారు.ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం.. జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పనుల్లో లేబర్ బడ్జెట్ ఎంత, ప్రాధాన్య భవనాల నిర్మాణం సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్స్, నాడు నేడు కింద నాడు నేడు క్రింద ఎంత మేర పనులు పురోగతిలో ఉన్నాయని, హెల్త్ పరంగా ఉన్న అంశాలపై రివ్యూ జరుగుతుందని అన్నారు.

 

జగనన్న హౌసింగ్ కాలనీల్లో ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో ఉన్న టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పై వెంటనే చర్యలు తీసుకొని అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమాధానాలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడు స్పందన వచ్చిన అర్జీల సమాధానాలను ఆన్లైన్లో ఉంచాలని అన్నారు. జిల్లాలో భూ సేకరణ పనులలో వేగవంతం చేసి నివేదికలు పంపాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు.. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ యదుభూషణ రెడ్డి, డిఆర్డిఎ పి డి పెద్దిరాజు, హౌసింగ్ పిడి కృష్ణయ్య, కడప, బద్వేలు, పులివెందల, జమ్మలమడుగు ఆర్డివోలు ధర్మ చంద్రారెడ్డి, వెంకటరమణ, వెంకటేష్, శ్రీనివాసులు,  స్పెషల్ కలెక్టర్ లు రామ్మోహన్, రోహిణి, అనుడా వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి, సిపిఓ వెంకట్రావ్, జిల్లా కోఆపరటివ్ ఆడిట్ ఆఫిసర్ శ్రీనివాసులు రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Development works should be speeded up-District Collector V.Vijay Ramaraju

Leave A Reply

Your email address will not be published.