Natyam ad

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థo మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున కాటేజీలు నిర్మించండి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు  దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్ విచ్చేశారు వీరికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున కాటేజీలు నిర్మాణం కొరకు వినతి పత్రం అందించారు.
దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల దర్శనార్థం పలు రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యల్లో స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున నూతన కాటేజీలు నిర్మాణం చేయాలని ఉప ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. దేవస్థానం తరపున స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కి తెలియజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు రమాప్రభ ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి, పండు జూలకంటి సుబ్బారావు, మరియు పట్టణ ప్రముఖులు కొండూరు నంద, వెంకటసుబ్బయ్య , దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Devendra Fadnavis, Deputy Chief Minister of Maharashtra, visited Srikalahasteeshwara Swami Ammawarla.

Post Midle