Natyam ad

వైభవంగా దేవి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలలోని పలు ఆలయాల్లో సోమవారం వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మండలంలోని అన్ని ప్రధానాలయాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రామసముద్రంలోని శ్రీ దుర్గమ్మ ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి ఆలయం, తిరుమల రెడ్డిపల్లిలోని శ్రీ మారెమ్మ ఆలయం, గుంతల పేట లో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం, గుంత ఎంబాడి, గంపన పల్లెలో చౌడేశ్వరి దేవి ఆలయం, నరసాపురం లోని శ్రీ మునీశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయాలలో ప్రతిరోజు దేవి నవరాత్రులు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఆలయాల్లో అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. హాజరైన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Devi Navratri celebrations begin with grandeur

Post Midle

Leave A Reply

Your email address will not be published.