పుంగనూరులో వైభవంగా ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు
పుంగనూరు ముచ్చట్లు:
నవరాత్రి ఉత్సవాలు ఆదివారం పలు ఆలయాల్లో వైభవంగా ప్రారంభించారు. పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇన్‌స్పెక్టర్ మునీంద్రబాబు ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. అలాగే శ్రీబోగనంజుండే శ్వరస్వామి ఆలయంలో పార్వతిదేవిని కుంకుమ, పసుపుతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీచాముండేశ్వరి ఆలయంలో అమ్మవారిని, శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయాల్లో హ్గమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి.

Tags: Devi Navratri celebrations started with grandeur in Punganur
