విలువలు, సంస్కారం, వ్యక్తిత్వం లేని వింత జీవి దేవినేని ఉమామహేశ్వరరావు
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు.
ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
విలువలు, సంస్కారం, వ్యక్తిత్వం లేని వింత జీవి దేవినేని ఉమామహేశ్వరరావు అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో రూ.25.25 లక్షల వ్యయంతో నిర్మించిన ది కొటికలపూడి ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ (సొసైటీ) భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.ఉమ్మడి కృష్ణాజిల్లా జెడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారికరాము , కేడీసీసీబీ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీలో ఆశీలు వసూలు అనేది చట్టబద్ధంగా జరుగుతుందన్నారు. ఇది ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమన్నారు. జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీల్లో కుడా ఆశీలు వసూలు జరుగుతుందన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ దేవినేని ఉమా తన వెకిలి చేష్టలు చేస్తున్నాడని విమర్శించారు.పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు దేవినేని ఉమాది వరెస్టు హ్యూమన్ బీయింగ్ అని అన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చూసి తట్టుకోలేడన్నారు. అతని కళ్ళు అభివృద్ధిని చూడలేవన్నారు.నేను కూడా దేవినేని ఉమా తరహాలో మా నాయకులతో మాట్లాడిస్తే దేవినేని ఉమా రెండు చెవులు పగిలిపోతాయి. తాడు బొంగరం లేని దేవినేని ఉమా చెప్పినట్లు నేను ఇక్కడ వెయ్యి కోట్లు సంపాదిస్తే ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పదేళ్లలో దేవినేని ఉమా సుమారు రూ.2వేల కోట్లు సంపాదించి ఉండాలన్నారు. ఎవరైనా వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ద్వారా ఆదాయం పొందుతూ జీవనం కొనసాగిస్తూ వుంటారు. అతను ఏం చేసి సంపాదిస్తున్నాడు. రాజకీయాలు పక్కన పెడితే దేవినేని ఉమా ఒక్క పైసాకు కూడా చెల్లడు. ఎందుకూ పనికిరాడు. దేవినేని ఉమాకు అవకాశం కలసివచ్చి, వదినను చంపిన తర్వాత 20 ఏళ్ళు రాజకీయాలలో చెలాయించడానికి అవకాశం కలిగిందన్నారు. అతడికి రాజకీయ జీవితానికి బ్రేక్ వేశాను కాబట్టే తనపై బురద జల్లుతున్నాడనన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు విచిత్ర, వికృత పోకడల వల్ల టీడీపీ కృష్ణాజిల్లాలో శిథిలమైందన్నారు. దేవినేని ఉమా తన దరిద్రపు నోటితో వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు. మైలవరం పశుపతి దేవినేని ఉమా అని అన్నారు. 2024 ఎన్నికల్లో అతడిని శాశ్వతంగా సమాధి చేసి జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
కొటికలపూడి గ్రామంలో రూ.2.52 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 27 సొసైటీలకు గానూ 21 సొసైటీల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని, వీటిలో 14 సొసైటీ భవనాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Devineni Umamaheswara Rao is a strange creature without values, culture and personality
