దేవిసింగ్ పటేల్ గుండెపోటుతో కన్నుమూత

Devising Patel passes away with heart attack

Devising Patel passes away with heart attack

Date:05/11/2018

భోపాల్ ముచ్చట్లు:

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుండగా బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని రాజ్పూర్ బీజేపీ అభ్యర్థి దేవిసింగ్ పటేల్ గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గత  కొంతకాలం నుంచి చికిత్స పొందుతున్న పటేల్.. గుండెపోటు రావడంతో బర్వాణీ హాస్పిటల్లో ఉదయం 5గంటలకు తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు పటేల్. త్వరలో జరగనున్న ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థి బాల బచ్చన్ను ఓడించేందుకు బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన దేవిసింగ్ పటేల్ అంతలోనే కన్నుమూయడం బీజేపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1989లో ఎన్నికల్లో అంజాద్ నుంచి పోటీచేసి విజయం  సాధించిన పటేల్.. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. బీజేపీ నేత పటేల్ అంత్యక్రియలు స్వగ్రామమైన బంద్రాకచ్చా నిర్వహించనున్నారు.

మార్కెట్లోకి పతంజలి జీన్స్

Tags:Devising Patel passes away with heart attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *