Devotees angry over lack of free darshans at Boyakonda

బోయకొండలో ఉచిత దర్శనాలు లేకపోవడంపై భక్తుల ఆగ్రహం

– మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు

Date:27/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్దిగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఉచిత దర్శనాలు లేకుండ టికెట్లతో దర్శనాలు చేయించడంపై పేద భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పుంగనూరు, ముళబాగిల్‌కు చెందిన భక్తులు బోయకొండ దర్శనానికి వెళ్లారు. అక్కడ రూ.200, 100, 50, 20 లు మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని, ఉచిత దర్శనాలు లేవని భక్తులకు తెలపడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనై, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాగా బోయకొండ ఆలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటోందని భక్తులు తెలిపారు. వందల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చినా, నిబంధనలకు విరుద్ధంగా ఉచిత దర్శనాలు కల్పించకపోవడం ఏమిటని నిలధీశారు. అలాగే ఆలయం వద్ద కొబ్బరికాయలు, కూల్‌డ్రింక్‌లు, ఇతర తినుబండారాల ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యాపారులు భక్తులను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఈవో వివరణ…

ఈ విషయమై ఈవో చంద్రమౌళిని న్యూస్‌లైన్‌ విచారించగా కరోనా నియంత్రణ సందర్భంగా ఉచిత దర్శనాలు రద్దు చేయడం జరిగిందని, త్వరలోనే ఉచిత దర్శనాలు ఏర్పాటు చేసి, పేద భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పిస్తామని తెలిపారు.

సంఘమిత్రకు 60 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఫిర్యాదు

Tags; Devotees angry over lack of free darshans at Boyakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *