భక్తులే మ‌న‌ దేవతలు -టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

భక్తులే మా ఆరాధ్యదైవం అంటూ టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో యాత్రికులకు సేవలందించాల‌ని ఈవో   ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమ‌ల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో సోమవారం ఉద‌యం ఈవో జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం ఈవో అధికారులు, ఉద్యోగులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర భారతం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. కోవిడ్ అనంతరం తిరుమలలో భారీ రద్దీ నేప‌థ్యంలో గత ఐదు నెలలుగా అంకితభావంతో సేవలందించిన టీటీడీ అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసు సిబ్బందిని ఆయ‌న‌ ప్రశంసించారు.ఈ ఏప్రిల్ నుండి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను సడలించడంతో తిరుమలలో యాత్రికుల రద్దీ అధికంగా ఉంద‌న్నారు. అన్నప్రసాదం, ఆరోగ్యం, విజిలెన్స్, కల్యాణ కట్ట, రిసెప్షన్ మరియు ఆలయ విభాగాల ఉద్యోగులు అద్భుతంగా సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. అధిక రద్దీ ఇప్పటికీ కొనసాగుతోంది,” అని అన్నారు. శ్రీవారి వైభవాన్ని, యాత్రికుల సౌక‌ర్యార్థం టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

తిరుమలలో గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కసారి పరిశీలిస్తే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన విశ్రాంతి గృహాలన్నీ భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఆధునీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. 7 వేల విశ్రాంతి గృహాలలో ఇప్పటికే 5 వేల గ‌దుల‌లో వేడి నీటి గీజర్ల అమర్చిన‌ట్లు, మిగిలినవి సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయ‌నున్న‌ట్లు చెప్పారు “.నూత‌నంగా నిర్మించిన‌ పరకామణి భవనం కూడా సెప్టెంబరు 28న తిరుమలలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని తెలిపారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో ఎస్వీ మ్యూజియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్ధిదేందుకు టాటా ట్ర‌స్టు ముందుకు వచ్చిందన్నారు. తిరుమల ఆలయంలోని ఆభరణాలు, కళాఖండాలు భక్తుల కోసం 3డి ఇమేజింగ్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేసి ప్రదర్శనకు ఉంచ‌నున్న‌ట్లు ’’ ఈవో తెలిపారు.భారతదేశం 75 స్వాతంత్య్ర సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భ‌న్ని పురస్కరించుకుని టీటీడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. టీటీడీ ఉద్యోగులందరూ ఇదే స్ఫూర్తితో తమ సేవలను కొనసాగించి భక్తులకు మ‌రింత ఉన్న‌తంగా సేవలను అందించాలని ఈవో ఆకాంక్షించారు.ఎస్‌ఈ – 2  జగదీశ్వర్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, విజివో  బాలిరెడ్డి, ఈఈలు, డెప్యూటీ ఈవోలు, ఏవీఎస్‌ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:Devotees are our gods – TTD Evo AV Dharma Reddy

Leave A Reply

Your email address will not be published.