భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
రామచంద్రపురం ముచ్చట్లు:
దక్షిణ కాశీ, పంచారామ క్షేత్రంగా పేరుగాంచిన దాక్షారామ శ్రీ మణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది.
ఈ ఏడాది మహాశివరాత్రి నాడు శని త్రయోదశి మహాశివరాత్రి కలిసి రావడంతో అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్సు తాగునీరు మజ్జిగ పాలు అన్నప్రసాదాలను ఏర్పాటుతోపాటు చలువ పందిర్లు కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సప్త గోదావరిలో భక్తులు స్నానం ఆచరించి, స్వామివారిని దర్శించుకుని. తరించారు.మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Tags: Devotees flock to Bhimeswara temple

