క్షీరా రామలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

క్షీరా రామలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

పాలకొల్లు ముచ్చట్లు:

 

పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం 3వ రోజు  సోమవారం  కావడంతో ఈరోజు విశేషమైన రోజుని అర్చకులు తెలిపారు.భక్తులు జోరు వానను కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని  దర్శంచుకుని పూజాధి కార్యక్రమాలు నిర్వహించి దీపారాధనలు చేశారు. భక్తులు ఎవరైతే ఇంటి వద్ద దీపారాధన చేసుకోవడానికి వీలు ఉండదు. అటువంటి భక్తులు ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం పొడువునా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని తెలిపారు. వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయం శివనామ స్మరణతో మారు మ్రోగింది.  భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేసారు.

Tags:Devotees flock to Ksheera Ramalingeshwar temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *