తెల్లవారుజామునే బారులు తీరిన భక్తులు

తెల్లవారుజామునే బారులు తీరిన భక్తులు

హైదరాబాద్ ముచ్చట్లు:

వైకుంఠ ఏకాదశి సందర్భం గా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతు న్నా యి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిం చుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు.వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమి స్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయా లకు తరలివచ్చా రు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున ఆలయా ల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం.

Tags: Devotees lined up early in the morning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *