భక్తులు లేక ఖాళీగా తిరుపతి

Devotees or vacant Tirupati

Devotees or vacant Tirupati

Date:15/08/2018
తిరుపతి ముచ్చట్లు:
తిరుమల లో అష్ట బంధన బలాలయ మహా సంప్రోక్షణ కారణంగా తిరుపతిలో బంద్ వాతావరణం….
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల ప్రస్తుతం వేద మంత్ర ఘోషతో మారుమోగిపోతోంది. పుష్కర మాసానికి ఒక్కసారి వచ్చే అష్ట బంధన బలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం దేదీప్య మానంగ కొనసాగుతోంది.
ఆరు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఈ కృతువుకు భక్తులను పరిమితి సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుమల కి వచ్చే భక్తులు పూర్తిగా తగ్గిపోయారు. తిరుమల ప్రభావం తిరుపతి పై పడింది. సాధారణంగా వీకెండ్ లో రద్దీ తిరుపతిలోని ప్రయణ ప్రాంగణం కిటకిటలాడడం సర్వసాధారణం.
అయితే పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే అష్ట బంధన బలాలయ మహా సంప్రోక్షణ కారణంగా తిరుమల లోనే కాదు, తిరుపతి లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ముఖ్యంగా తిరుపతి కి సుదూర ప్రాంతాల నుంచి రైలు, బస్సు మార్గాల ద్వారా అరవై వేల మంది వాస్తు పోతూ ఉంటారు.తిరుమలలో జరుగుతున్న ఈ వైదిక కార్యక్రమం నేపథ్యంలో రోజుకి 18 వేల నుంచి 30 వేల మంది భక్తులను మాత్రమే అనుమాటిస్తామంటూ టీటీడీ చెప్తున్న సందర్భంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరుమల కి భక్తులు రావడానికి సాహసించడం లేదు.
సాధారణ రోజుల్లో తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ 1700 ట్రిప్పులు నడుపుతూ, 40 వేల నుంచి 60 వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం తిరుమలలో మహా క్రతువు కారణంగా జిల్లాలోని 14 ఆర్టీసీ డిపోలలోని బస్సులు తిరుమల కి కేవలం 800 ట్రిపులకే పరిమితం చేశారు. మరోవైపు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే బస్సులు బస్ స్టాండ్ కే పరిమితమయ్యాయి. తిరుపతి లోని టాక్సీ డ్రైవర్లు వాహనాలను ప్రయాణికులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రయాణికులు లేక వెలవెల బోతున్నాయి.
నిత్యం దేశ వ్యాప్తంగా తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా రోజుకి 80 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ రైళ్ల ద్వారా 45 వేల నుంచి 50 వేల మంది వస్తుంటారు. అయితే ప్రస్తుతం నామమాత్రపు ప్రయాణికులతో రైల్వే ప్రాంగణం ఖాళీగా కనిపిస్తోంది.తిరుమలలో అష్ట బంధన బలాలయ మహా సంప్రోక్షణ కారణంగా తిరుపతి హోటల్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి.
తిరుపతి లో రెండు ఫైవ్ స్టార్ హోటళ్లతో పాటు, పది త్రీ స్టార్ హోటళ్లతో కలిపి సుమారు 300 హోటళ్లు ఉన్నాయి. వీటిలో పది వేల మంది బస చేసే సామర్ధ్యం ఉంది. సాధారణ రోజుల్లో 4 నుంచి 5 కోట్ల వ్యాపారం జరుగుతుంది.
రద్దీ రోజుల్లో మరో రెండు కోట్లు అదనపు వ్యాపారం జరుగుతుంది. తాజాగా తిరుమల కి యాత్రికులు పూర్తిగా తగ్గిపోవడంతో తిరుపతి లో హోటల్స్ అన్ని వెలవెల బోతున్నాయి. మొత్తంమీద శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ కారణంగా తిరుపతిలో బంద్ వాతావరణం కనిపిస్తోంది.
Tags: Devotees or vacant Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *