ర‌ద్దీ స‌మ‌యంలో భ‌క్తులు ఓపిక‌తో ఉండాలి -టిటిడి ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి

డయల్‌ యువర్‌ ఈవో కార్య‌క్ర‌మం ముఖ్యాంశాలు

 

తిరుమ‌ల ముచ్చట్లు:

Post Midle

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమలలో వేసవి ఏర్పాట్లు :

– వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి.

– తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

– జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.

– ఇటీవల కాలంలో మే 29న అత్యధికంగా 92 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. టిటిడి సిబ్బందితోపాటు పోలీసులు, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందించారు. రానున్న రోజుల్లో ఇదే సమన్వయంతో పనిచేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం.

అమరావతిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ :

– సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. ఇటీవల విశాఖపట్నం, భువనేశ్వర్‌లో నిర్మించిన శ్రీవారి ఆలయాలలో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

– అమరావతిలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్‌ 4 నుండి 9వ తేదీ వరకు జరిగాయి.

ఆగస్టు 7న రాష్ట్రవ్యాప్తంగా కల్యాణమస్తు :

– పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.

– రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7న కల్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నాం. ఆయా జిల్లాల్లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

– శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దశమి ఆదివారం ఉదయం 8 గం.07 నిమిషాల నుండి 8 గం. 17 నిమిషాల మధ్య టిటిడి పండితులు సుముహూర్తం నిర్ణయించారు.

– కరోనా కారణంగా నిలిచిన ఈ సామూహిక వివాహాలను పునఃప్రారంభించడం జరుగుతోంది.

– తద్వారా ఎన్నో కుటుంబాలు తమ పిల్లలకు స్వామివారి ఆశీస్సులతో వివాహాలు చేసుకునే చక్కటి అవకాశం కలుగుతుంది.

టిటిడి అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు :

– హైదరాబాద్‌లోని హిమాయ‌త్ న‌గ‌ర్‌లో గ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్‌ 6 నుండి 10వ తేదీ వరకు జ‌రిగాయి.

– అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్‌ 10 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు :

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. జూన్‌ 14వ తేదీ వరకు జరుగుతాయి.

ఎస్వీబిసి

– తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మే 29న సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరిగింది.
నాలుగు బృందాల్లో వేద పండితులు మొత్తం 2,808 శ్లోకాలను దాదాపు 16 గంటల పాటు నిర్విరామంగా పారాయణం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ప్రశంసించారు. ఈ సంద‌ర్భంగా హ‌నుమంతుల వారు వాన‌ర‌రూపంలో విచ్చేసి ప్ర‌సాదం స్వీక‌రించి వెళ్లారు.

– తిరుమల నాదనీరాజనం వేదికపై జూన్‌ 1వ తేదీ నుండి సభాపర్వం ప్రవచనం కొనసాగుతోంది.

– జూన్‌ 1 నుండి ఆగస్టు 30వ తేదీ వరకు మాసవైశిష్ట్యం కార్యక్రమంలో భాగంగా వామన పురాణం జరుగుతోంది.

– జూన్‌ 6న ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో శుక్లదేవార్చనం పూజా కార్యక్రమం జరిగింది.

– ఈరోజు తిరుమల వసంత మండపంలో విష్ణు అర్చనం పూజా కార్యక్రమం జరుగుతుంది.

– జూన్‌ 14వ తేదీ ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో వటసావిత్రి వ్రతం నిర్వహించనున్నారు.

– జూన్‌ 12 నుంచి 14వ తేదీ వరకు తిరుమలలో అభిద్యేయక జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది.

– ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

– సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు.

– తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

– మొదటిరోజు శ్రీ మల‌యప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు.

– రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు.

– మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు.

– ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.

మే నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.62 లక్షలు

హుండీ :

– హుండీ కానుకలు – రూ.130.29 కోట్లు

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1 కోటి 86 వేలు

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 47.03 లక్షలు

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 10.72 లక్షలు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో   న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో   సురేష్‌కుమార్‌, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, డెప్యూటీ ఈవోలు   భాస్క‌ర్‌,   రామారావు, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్   శ్రీ‌నివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Tags: Devotees should be patient during rush hour – TTD Evo AV Dharmareddy

Post Midle
Natyam ad