తిరుపతి ముచ్చట్లు:
తిరుమలలో భక్తులకు రక్షణ కల్పించాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. తిరుమలలో వేలాది మంది భక్తులు చూస్తుండగానే హ్యాకర్లు నడిరోడ్డుపై రక్త గాయాలయ్యాలే కొట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొండపైన దుకాణం నిర్వహించే ఓ దుకాణదారుడు భక్తుడిని గాయపరచిన సంఘటన మరువకముందే ఇలాంటి మరో సంఘటన పునరావృతం కావడం కచ్చితంగా నిఘా అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారని ఆయన గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో నిఘా కొరవడిందని తిరుమల కొండపై అనధికార హ్యాకర్లు ఎక్కువయ్యారని తిరుమలలో ప్రక్షాళన చేపడుతామన్న కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైనదని ఏద్దేవా చేశారు.అందరూ చూస్తుండగానే హ్యాకర్లు కొట్టుకోవడం లాంటి పరిణామాలు భక్తుల్ని భయపెడుతున్నాయని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు తిరుమలలో భక్తులకు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:Devotees should be protected in Tirumala – MP Maddila Gurumurthy