అప్పన్న సన్నిధిలో భక్తుల ఆగచాట్లు
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ సింహాచలం చందనోత్సవం అప్పన్నస్వామి భక్తుల దర్శనంలో లోటుపాట్లు అధికారుల తీరుకు అద్దం పడుతున్నాయి.ఈ సారి టైమ్ స్లాటు విదానాన్ని ప్రవేశపెట్టినా భక్తులకు సరైన రీతిలో దర్శనం కల్పించలేని అధికారుల అలసత్వాన్ని టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత ఎండగట్టారు.క్యూలైన్ లో వేచి ఉన్న భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. అధికారుల ఏర్పాట్లు చేయడంలో అట్టర్ ప్లాప్ అయ్యారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1500 వి వి ఐ పి టికెట్లను నియంత్రించకపోవడం దీనికి ప్రధాన కారణమని భక్తులు మండిపడుతున్నారు.భక్తులకు ఎటువంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోగా దేవస్థానం అధికారులు, పోలీసుల ఇస్టా రాజ్యంగా ఐపొయిందని అన్నారు.
Tags; Devotees stop in the presence of Appanna

