Natyam ad

పోయిన బంగారు అప్పగింత-హర్షం వ్యక్తం చేసిన భక్తులు..

తిరుపతి ముచ్చట్లు:


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలు కొర్చి వస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు వెళ్లేంతవరకు విజిలెన్స్ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తమ విధులను నిర్వర్తిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో తిరుచానూరుకు చెందిన నవ వధూవరులు గురువారం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే సమయానికి పెళ్ళికొడుకు కు చెందిన రెండున్నర సవర బంగారపు బ్రాస్లెట్ కనిపించకపోవడంతో కంగారుకు లోనయి విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేశారు.విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదును స్వీకరించి ఇదివరకే వారికి హుండీ వద్ద దొరికిన బ్రాస్లెట్ను వారికి చెందినదా కాదా అని తగిన ఆధారాలు తీసుకొని రమ్మని విజిలెన్స్  ఇన్స్పెక్టర్ రామ్మోహన్ కోరారు. తగిన ఆధారాలు వారు తీసుకొని రావడంతో అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సైలేంద్రబాబు సూచనల మేరకు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ వారి బంగారాన్ని తిరిగి అప్పగించారు. అంతా అమ్మవారి దయ వల్లనే మా బంగారు మాకు దొరికిందని అలాగే  విజిలెన్స్ సిబ్బంది వెంటనే స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Tags:Devotion of the lost gold-delighted devotees..

Post Midle
Post Midle