ఆటవీ సంపద రక్షణ  పటిష్టం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి

DGP Mahender Reddy in Video Conference at Secretariat

DGP Mahender Reddy in Video Conference at Secretariat

Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు
అటవీ భూమిని కాపాడటం, పర్యావరణ రక్షణ ప్రతీ పౌరుడి బాధ్యత. కొన్ని ప్రాంతాల్లో అటవీభూముల ఆక్రమణ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.  పట్టా భూములు కాకుండా కొత్తగా ఆక్రమణలను కచ్చితంగా అడ్డుకోవాల్సిందేనని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు జరిగిన అటవీ భూములు, వన్యప్రాణుల రక్షణ, వేట నియంత్రణపై  పోలీస్, అటవీ శాఖల మధ్య సమన్వయ సమావేశంలో అయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. డీజీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున అటవీ శాఖకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం. ఆక్రమణల దారులు, వేటగాళ్లపై పీ.డీ యాక్టు పెట్టి కేసులు పెడతామని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇచ్చేందుకు పచ్చదనం అవసరం.  పోలీస్ శాఖ, సిబ్బంది నాలుగో విడత హరితహారంలో పెద్ద ఎత్తున పాల్గొంటాం. అడవి ప్రాధాన్యత, అది చేసే మేలుపై సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అయన అన్నారు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో అడవి ఆక్రమణలకు గురికాకుండా చూడాలి. ఆక్రమణల తర్వాత కేసులు పెట్టడం కంటే, అసలు ఆక్రమణలు జరగకుండా చూడాలి. ఆక్రమణలకు గురైన అటవీ భూములను గూగుల్ మ్యాపులతో ప్రచారం చేయాలి. అటవీ భూముల ఆక్రమణలపై స్థానిక ప్రజాప్రతినిధులకూ అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఆక్రమణలు, వేట వ్యవహారాల గుర్తింపుకు ఉపయోగిస్తాం. ఆక్రమణల్లో పాల్గొంటున్న కూలీలపై చర్యలు  కాకుండా, నిజమైన నిందితులను గుర్తించాలని మహేందర్ రెడ్డి సూచించారు.
ఆటవీ సంపద రక్షణ  పటిష్టం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి https://www.telugumuchatlu.com/dgp-mahender-reddy-in-video-conference-at-secretariat/
Tags:DGP Mahender Reddy in Video Conference at Secretariat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *