డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రైవేట్ సైన్యానికి అధిపతి

DGP Mahender Reddy is the head of the KCR private army

DGP Mahender Reddy is the head of the KCR private army

-నాకు,నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినాకేసీఆర్, డీజీపే కారణం
– డీజీపీ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
Date:17/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఓటుకు నోటు కేసు తిరిగి తీస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ ఇప్పుడు కేసీఆర్,మోడీ రహష్య ఒప్పందం ద్వారా మరోసారి కేసును తిరగదొదాలనుకుంటున్నారు.ప్రభుత్వ రద్దుకు ముందు ఢిల్లీ పర్యటనను కేసీఆర్,కేటీఆర్ చేపట్టారు.
కొన్ని సార్లు అధికారికంగా,కొన్ని సార్లు రహస్యంగా …..పర్యటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ హక్కైల కోసం కాకపోగా ,తమ స్వంత లబ్ది కోసం అని మేము చాలా సార్లు చెప్పాము.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత,కాంగ్రెస్ పార్టీలో రాణించకుండా కుట్ర చేపట్టాడు కానీ కేసీఆర్ సఫలీకృతం కాలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికల సందర్బంగా రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే టీఆరెస్ ను అడ్డుకుంటాడు అని అక్రమ కేసులు పెట్టించాడని ఏ4 గా ఉన్న మత్తయ్య ఖ్వాష్ పిటిషన్ ఎస్తే అక్రమంగా కేసులు పెట్టాడని.ఎఫ్ఐఆర్ చేయకుండా అరెస్ట్ చేయడం అక్రమం అని మత్తయ్య మీద కోర్టు కేసు కొట్టివేసిందన్నారు.
చంద్రబాబు స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడాడు అని అందులో ఇరికించారు.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు.నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు నచ్చక చంద్రబాబు ప్రభుత్వం నుండి బయటకి వచ్చాడు. అప్పటి నుండి ఈ కేసీఆర్,మోడీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగా ఈడీ, సీబీఐ ద్వారా ఓటుకు నోటు కేసు పైన నా పైన నా బందువులపైన ఇంకమ్ టాక్స్ దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రణాళిక బద్దంగా నా పై నకుటుంబ సభ్యులు పైమ ఈడీ దాడులు చేయాలని సిద్ధమైందని,రాబోయే రోజులు అత్యంత కీలకం.కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.దీనికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ కు చట్టాన్ని ఉల్లంఘించి సహకరిస్తున్నారని, నా పైన విచారణకు.
పాత డేట్ల పైన లేఖలు రాస్తున్నారు చట్టవ్యతిరేకమైన చర్యలతో ప్రైవేట్ సైన్యంతో డీజీపీ కేసీఆర్ కు కాసిమ్ రాజ్వి లాగా చేస్తున్నాడని ఆరోపించారు.నాకు,నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా,కేసీఆర్,ప్రభాకర్ రావు ,డీజీపీ పే కారణం.
కాంగ్రెస్ అధినాయకత్వం నాకు ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో,రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి ఇలాంటి పనులకు టీఆరెస్ పార్టీ,కేసీఆర్ కుట్ర చేస్తుంది.రేవంత్ రెడ్డి మీద ఈడీ దాడులు జరుగుతాయి అని పార్టీ శ్రేణులకు మెస్సేజ్ ఇచ్చారు కేసీఆర్.
డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రైవేట్ సైన్యానికి అధిపతి నాకు పదవి ఇచ్చే రెండు రోజులముందే నా పై ఈడీ దాడులు జరుగుతాయి.చిప్పకుడు తిన్న విశ్వాసంతో చెప్తున్న మీ పైజామాలు ఉడుతాయని రేవంత్ హెచ్చరించారు.
Tags: DGP Mahender Reddy is the head of the KCR private army

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *