పొట్టి డ్రెస్సుల్లో ధడక్

Dhadak in short dresses

Dhadak in short dresses

Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
శ్రీదేవి తనయ, ‘ధడక్’ హీరోయిన్ జాన్వీ కపూర్ అనుకోకుండా నెటిజన్ల విమర్శల జడిలో చిక్కుకుంది. జాన్వీ దుస్తులపై నెటిజన్లు తెగ ఫైర్ అయిపోతున్నారు. ఆమె నిండైన దుస్తులు ధరించాల్సింది అంటూ వారు విరుచుకుపడుతున్నారు. ఆమె ప్రమేయం లేకుండా వెలుగులోకి వచ్చిన ఫొటోల వల్ల ఈ రచ్చ అంతా జరుగుతోంది.
అసలేం జరిగిందంటే.. జాన్వీ కపూర్ ఫొటోలను తీయడానికి ఫొటో గ్రాఫర్లు తరచూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవలే ఆమె ఇంటి బయట రోడ్డు మీదకు వచ్చిన సమయంలో ఎవరో ఫొటో గ్రాఫర్ కెమెరాకు పని చెప్పాడు. ఆ సమయంలో జాన్వీ చిట్టిపొట్టి వస్త్రధారణలో ఉండింది. కేవలం ఒక ఓవర్ సైజ్ టీ షర్ట్ ధరించి బయటకు వచ్చింది జాన్వీ. ఆ ఫొటో గ్రాఫర్ ఫొటోలను ఇంటర్నెట్‌ లోకి అప్‌లోడ్ చేశాడు, ఇంకేముంది.. అవి షేర్ అయిపోయాయి.
నెటిజన్లు జాన్వీకి నీతులు చెప్పడం మొదలుపెట్టారు. ఆమె పొదుపైన దుస్తులను ధరించడంపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తోచిన కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విమర్శలు జాన్వీకి కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఒకసారి ఇలాగే అంతా ఆమెను ట్రోల్ చేశారు. అప్పట్లో తను వీటిని ఖాతరు చేయను అని జాన్వీ స్పష్టం చేసింది. ఆ సమయంలో ఆమెకు అన్న అర్జున్ కపూర్ అండగా నిలిచాడు.
Tags:Dhadak in short dresses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *